పంచాయితీ ఎన్నికలకు అధికారులు సహకరించాలి – ఎల్వీ సుబ్రహ్మణ్యం

133

ఆంధ్ర ప్రదేశ్ లో రాజుకున్న పంచాయితీ ఎన్నికల చిచ్చుపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ పొందిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం రామమందిర నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ, ఏ ఉద్యోగి అయిన రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలని తెలిపారు. ఉద్యోగులు ఎన్నికలకి సహకరించాలని కోరారు. ఏమైనా ప్రాణ భయాలు, బెదిరింపులు ఉంటే రక్షణ తీసుకోని ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తెలిపారు.

ఎస్ఈసీనీ, ప్రభుత్వాన్ని బ్రతిమాలి అవసరమైతే అదనపు సెక్యూరిటీ తీసుకుని అయినా రాజ్యాంగ విలువల్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు ఎల్వీ . కాగా ఉద్యోగులు మాత్రం తాము ఎన్నికల విధులకు హాజరు కామని తెగేసి చెబుతున్నారు. కరోనా టీకా ఇస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని వారు చెబుతున్నారు. ఇక ఈ రోజు ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. దీనికి సంబందించిన తీర్పు ఈ రోజే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయితీ ఎన్నికలకు అధికారులు సహకరించాలి