Tamilisai Soundararajan: గవర్నరుకు ప్రతిష్టాత్మక అవార్డు!

155

Tamilisai Soundararajan: తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసైకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు వరించింది. తమిళిసై గ్లోబల్​ ఉమెన్​ ఆఫ్​ ఎక్సలెన్స్​- 2021 అవార్డు దక్కింది. సమాజ హితం కోసం సేవలు అందించినందుకు గానూ ఇచ్చే ఈ అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా 20 మహిళలు ఎంపిక కాగా.. అందులో అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలాహారిస్​తో పాటు గవర్నర్​ సౌందరరాజన్​ ఉన్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ను అంతర్జాతీయ పురస్కారం వరించింది. తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021 అవార్డు వచ్చినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా… అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్, తెలంగాణ గవర్నర్​ తమిళిసైతో పాటు మరో 18 మంది మహిళలు ఎంపికయ్యారు. ఈ నెల 7న గవర్నల్​ తమిళిసై… ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తమిళిసై ఇటీవలే పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​గా అదనపు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.