రైతులకు బీమా పరిహారం చెల్లించిన ప్రభుత్వం.

91

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ముందడుగు వేసింది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 2019 జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు పంట బీమా కింద పరిహారం అందచేసింది. ఈ పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

పరిహారం కింద ప్రభుత్వం 1,252 కోట్ల రూపాయలను పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమచేసింది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు వేశారు సీఎం జగన్. ఇక మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోతే పరిహారం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

 

రైతులకు బీమా పరిహారం చెల్లించిన ప్రభుత్వం.