మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్

76

హిందూపురం ఎంపీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 న పరిటాల రవిపై చేసిన వ్యాఖ్యలు మరువక ముందే.. ఈ రోజు కర్నూలు జిల్లా పెద్దపాడులో కార్తీక మాస వనభోజనాలకు హాజరై, రెడ్లు, కమ్ములను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమాయకులైన కురుమలు జోలికి రెడ్డి, కమ్మ అగ్రవర్ణాలవారు వస్తే సహించేది లేదని అన్నారు.

కురుమల మీద దాడులు చేస్తే ఊరుకోనని. ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కురుమలకు రక్షణగా తాను ఉన్నానని ప్రకటించాడు.. ఇక డిసెంబర్ 9న పరిటాల రవిని ఉద్దేశిస్తూ.. పెందుర్తి నియోజకవర్గంలో పరిటాల రవి నెత్తుటేరులు పారించారని తెలిపారు. నీరు లేని పొలాల్లో రవీంద్ర రక్తపు దరాలు పారేలా చేశారని వ్యాఖ్యానించారు. కాగా కర్నూలు, అనంతపురం జిల్లాలో కురుమలపై దాడులు జరిగిన దాఖలాలు లేవు. వీటికి సంబందించిన కేసులు కూడా నమోదు కాలేదు.

కాగా గోరంట్ల ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడని చాలామంది ఖండిస్తున్నారు.

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్