ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వేర్లు డౌన్

78

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వేర్లు డౌన్ అయ్యాయి. దీంతో గూగుల్, యూట్యూబ్, జిమెయిల్ కు అంతరాయం ఏర్పడింది. గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అంతరాయం ఏర్పడింది. యూట్యూబ్ లో వీడియోలు ప్లే అవ్వక పోవడంతో చాలా మంది యూజర్లు గూగుల్ కు మెయిల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎర్రర్ మెసేజిలను జత చేశారు.

తక్షణమే స్పందించిన గూగుల్ కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని సమాచారం ఇచ్చింది. భారత్, యూరప్, యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇబ్బందులను గుర్తించామని పేర్కొంది. ఎర్రర్ మెసేజిలపై 40,000 మందికి పైగా ఫిర్యాదులు చేశారు.