హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త

75

కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ రవాణా సర్వీసులు నిలిపివేసిన విషయం విదితమే. అయితే లాక్ డౌన్ సడలింపులతో సెప్టెంబర్ 25 నుంచి 25 శాతం సిటీ బస్సులను నడుపుతున్నారు. తర్వాత వాటిని 50 శాతానికి చేశారు. ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి 75 శాతం బస్సులు నడిపేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. గురువారం రవాణా శాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ బస్సు సర్వీసులు పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో బస్సు సర్వీసులను పెంచాలనే ప్రతిపాదనలు రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ ముందు ఉంచారు. దీనిపై స్పందించిన కేసీఆర్ బస్సులు నడిపేందుకు ఒప్పుకున్నారు. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ప్రజా రవాణాను పెద్దగా ఉపయోగించుకోవడం లేదు ప్రజలు.. దీనికి కారణం కరోనానే.

హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త