క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

137

కరోనా మహమ్మారి కారణంగా బొత్తిగా ఎంజాయ్ చెయ్యడమే మరిచిపోయారు ప్రజలు. పబ్బులకు క్లబ్బులకు వెళ్లలేని పరిస్థితి. కాలక్షేపానికి పార్క్ కి వెల్దామంటే మహమ్మారి తమను ఎక్కడ పట్టుకుంటుందో అనే భయం వెరసి ఎంజాయ్మెంట్ కె దూరమయ్యారు. ఇక సినిమా థియేటర్లు కూడా ఏడు నెలలకు పైనే మూతపడ్డాయి. ఒక నెలరోజులుగా 50 శాతం సిటింగ్ తో అనుమతి ఇస్తున్నారు. అయినా పబ్లిక్ భయంతో సినిమా హాళ్ల దిక్కు చూడటం లేదు. పట్టణాల్లో సీట్లు ఫిల్ అవుతున్న చిన్న పాటి నగరాల్లో థియేటర్లకు పోవాలంటే భయపడుతున్నారట.

ఇక కొందరు థియేటర్ల యజమానులైతే ఈ బాధలు తామెక్కడ భరిస్తాం వచ్చే నష్టం ఎలాగో వస్తుంది…. 50 శాతం సిటింగ్ తో నడిపి వచ్చి రాని ప్రేక్షకులతో మనం లాభాలను ఆర్జించడం కష్టమని అసలు తీయనేలేదు. ఇక ఇదిలా ఉంటే క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతి ఇచ్చింది. 50 శాతం సిటింగ్ తో క్రికెట్ మ్యాచ్ వీక్షించవచ్చని తెలిపింది. దింతో క్రికెట్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక స్టేడియంలో కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వమా దేశాలు జారీ చేసింది. సిబ్బంది స్టేడియంను రోజు శానిటైజ్ చెయ్యాలని తెలిపింది.

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్