అగ్రి గోల్డ్‌ బాధితులకు శుభవార్త

67

ఏపీలో అగ్రి గోల్డ్‌ బాధితులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు ఒకే చెప్పింది. దీంతో గ్రామ సచివాలయాల ద్వారా బాధితుల వివరాలు సేకరించే పనిలో పడింది సిఐడి..

ఈ మేరకు 2021 మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. సిఐడి నివేదిక అనంతరం బాధితులకు నగదు జమ కానుంది. కాగా పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీకి కట్టుబడి అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్‌ చేసిన విషయం తెలిసిందే.