దిగొచ్చిన బంగారం.. రెండు నెలల్లో రూ.8000 తగ్గిన ధర

80

బంగారం ధరలు జనవరి నెలలో ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. రూ. 52000 వెలవరకు వెళ్లడంతో సామాన్యులు బంగారం గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఇక ఫిబ్రవరి నెలలో అటుఇటుగా ఉన్న బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్చి 2 తేది నాటికి బంగారం ధరలు జనవరిలో పోల్చుకుంటే సుమారు రూ. 8000 తగ్గింది. మంగళవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.679 తగ్గి రూ. 44,760 కు దిగొచ్చింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండిపై రూ.1874 తగ్గి రూ.68,920కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్, డాలర్‌తో పోలిస్తే బలపడ్డ రూపాయి కారణంగా బంగారం ధరలు దొగొచ్చినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దేశంలో బంగారం డిమాండ్ కూడా తగ్గినట్లు తెలుస్తుంది. పెళ్లిళ్లు లేకపోవడంతో బంగారం డిమాండ్ అమాంతం తగ్గింది. ప్రతి ఏడాది ఈ సమయంలో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. కానీ ముహుర్తాలు లేకపోవడంతో బంగారం కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. గత కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు తాజాగా 45 వేల రూపాలయల మార్కు దిగువకు చేరుకున్నాయి. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గేఅవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దిగొచ్చిన బంగారం.. రెండు నెలల్లో రూ.8000 తగ్గిన ధర