19 ఏళ్ల తర్వాత పట్టుబడిన గోద్రా రైలు దహన ప్రధాన నిందితుడు!

239

గుజరాత్‌ పంచ్‌మహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషన్ వద్ద 19 ఏళ్ల క్రితం కరసేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోద్రా రైల్వేస్ స్టేషన్ సమీపంలోనే సోమవారం కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. గోద్రా ఘటనకు కుట్రపన్నిన వాళ్లలో రఫీక్ కీలక సభ్యుడు. ఇతడు రైల్వేస్ స్టేషన్ లో కూలీగా పనిచేస్తుండేవాడు..

Image result for godhra

రైలు గోద్రా రాగానే దానిపై మొదట రాళ్ళూ విసిరాడు.. అనంతరం రైలును కాల్చేందుకు పెట్రోల్ తీసుకొచ్చాడని గతంలో కేసును విచారణ చేసిన పోలీస్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటన అనంతరం రఫీక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దేశంలోని పలు ప్రాంతాలు తిరుగుతూ చివరకు ఢిల్లీ చేరాడు. ఢిల్లీ నుంచి కొద్దీ రోజుల క్రితం గోద్రా వచ్చాడు.

Image result for godhra

కాగా 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్‌లో కరసేవకులతో నిండిన ట్రైన్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో మొత్తం 59 మంది కరసేవకులు మృతి చెందారు. గోద్రా వచ్చాడన్న సమాచారం తెలియడంతో మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా ఈ కేసు విచారణ 19 ఏళ్లుగా సాగుతూనే ఉంది.

Image result for godhra

గోద్రా ఘటన తర్వాత గోద్రా అల్లర్లు మొదలయ్యాయి.. ఇది అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. నాటి గుజరాత్ సీఎంగా ఉన్న నేటి ప్రధాని మోడీ అల్లర్ల విషయం తీవ్ర ఆరోపణలు ఎదురుకున్నారు. జైలుకు వెళ్తారని అందరు అనుకున్నారు. కానీ కోర్టు తీర్పు మోడీకి అనుకూలంగా వచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మోడీని విమర్శించేందుకు గోద్రా అల్లర్లను గుర్తు చేస్తుంటారు.

Image result for godhra

19 ఏళ్ల తర్వాత పట్టుబడిన గోద్రా రైలు దహన ప్రధాన నిందితుడు!