నిర్మానుష్య ప్రాంతంలో యువకుడితో బాలిక.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

231

కొందరు యువకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని మోరల్ పోలీసింగ్ కి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో గయాలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడితో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న బాలికపై కొందరు యువకులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను హింసిస్తూ వీడియోలు తీశారు. ఆమెతో ఉన్న యువకుడిపై కూడా దాడి చేశారు. ఆ బాలిక వీడియో తీయొద్దని బ్రతిమాలినా ఆ యువకులు వినలేదు. కెమెరాలో రాకుండా ఉండేందుకు ముఖం కనిపించకుండా బాలిక స్కార్ఫ్ కట్టుకోగా స్కార్ఫ్ ను లాగి పడేశారు. ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆ బాలికతో వచ్చిన యువకుడిని ఒక గ్రూపుగా వచ్చిన యువకులు కొట్టారు.

బాలికను బండబూతులు తిట్టారు. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని బెదిరించారు. ఆ యువకుడిపై దాడికి పాల్పడిన యువకులు అతని వివరాలు చెప్పాలని బెదిరించారు. బాలిక పారిపోయ్యేందుకు ప్రయత్నించగా తిరిగి ఆమెను తీసుకొచ్చి దూషించారు. ఆ యువకుడు వెంటపడి మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. చున్నీ లాగేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన గయా ఎస్‌ఎస్‌పీ ఆదిత్య కుమార్ మాట్లాడుతూ.. మోరల్ పోలీసింగ్‌కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

నిర్మానుష్య ప్రాంతంలో యువకుడితో బాలిక.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!