మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి

358

హైదరాబాద్ :- బుధవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి మద్యం తాగి చిందేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై బట్టలు ఉన్నాయా లెవా అనే విషయం మరిచింది. ఈ ఘటన రెహమత్ నగర్ పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో జరిగింది. ఆమెను గమనించిన అవుట్ పోస్ట్ మహిళాపోలీసులు అక్కడికి చేరుకొని దుస్తులు ఇచ్చారు. అయితే ఆమె వాటిని కూడా చింపి డాన్స్ చేసింది. దింతో మరో జత దుస్తులు ఇచ్చారు. అనంతరం ఆమె ప్రియుడికి ఫోన్ చేసి నువ్వు మోసం చేశావు, నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

దింతో పోలీసులు ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు స్టేషన్ కు తీసుకెళ్లారు. మత్తు దిగిన తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్టేషన్ కు వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను తీసుకోని ఇంటికి వెళ్లారు. కాగా సదరు యువతిది కూకట్ పల్లిగా తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చెయ్యలేదు. అయితే గతంలో ఇటువంటి ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాగినమైకంలో ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేసింది. అప్పట్లో యువతికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి