రాజ్యసభలో కన్నీరు పెట్టిన మోడీ.. ఆజాద్ నాకు మంచి మిత్రుడు

274

ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో కన్నీటిపర్యంతమయ్యారు. పదవి ముగుస్తున్న ఎంతలను ఉద్దేశిస్తూ రాజ్యసభలో మాట్లాడారు మోడీ.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ గురించి ప్రస్తావించారు. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని తెలిపారు. ఆజాద్ జమ్మూకాశ్మీర్ సీఎంగా ఉన్న సమయంలో అయన చేసిన మేలు మరిచిపోలేనని గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో గుజరాత్ పర్యాటకులు అక్కడ చుక్కుకున్నారని.. తాను వెంటనే ఆజాద్ కి ఫోన్ చేసి విషయం చెప్పానని.. స్వంతవారిలా గుజరాతీ పర్యాటకులను చూసుకున్నారని తెలిపారు.

అనేక సార్లు ఫోన్ చేసి వారికీ సంబందించిన వివరాలు తెలిపేవారని గుర్తు చేశారు. ఆ మేలు తాను జన్మలో మర్చిపోనని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఆజాద్ చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ.. ఆయనకు సెల్యూట్ చేశారు. ఉన్నత పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ గులాం నబీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. కాగా కేరళ నుంచి ఆజాద్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఏప్రిల్ లో ఆరేళ్ళ కాలపరిమితి ముగియనుంది.

రాజ్యసభలో కన్నీరు పెట్టిన మోడీ.. ఆజాద్ నాకు మంచి మిత్రుడు