బ్రేకింగ్ – ఘాట్ కేసర్ పార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

396

ఘాట్ కేసర్ లో ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని డ్రామా ఆడిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. షుగర్ ట్యాబ్లేట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఫిబ్రవరి 10 తేదీ రాత్రి వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లి అనేక సార్లు ఆమెకు ఫోన్ చేసింది. తల్లికి ఎలా చెప్పాలో తెలియక తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని అబద్దం ఆడింది. నిజానికి ఆ విద్యార్థిని ఆమె స్నేహితులతో కలిసి నిర్జన ప్రాంతానికి వెళ్ళింది.. కూతురు కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఆమె తల్లి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతి తక్కువ సమయంలో ఆమె ఉన్న ప్రదేశాన్ని కనుగొని సదరు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అనుమానితులుగా ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో తాము ఈ తప్పు చెయ్యలేదని చెప్పడంతో పోలీసులు యువతిని అనేక కోణాల్లో విచారించారో దింతో ఆమె బయటపెట్టింది. దింతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాను తన స్నేహితులతో వెళ్లినట్లు, తన తల్లి అనేక సార్లు ఫోన్ చెయ్యడంతో ఆలా చెప్పినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. విషయం బయటకు రావడంతో అవమానం భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది

బ్రేకింగ్ – ఘాట్ కేసర్ పార్మసీ విద్యార్థిని ఆత్మహత్య