ఘాట్ కేసర్ అత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రేమికుడే ఇదంతా చేశాడు

170

బుధవారం సాయంత్రం బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు హత్యాచారం చేశారని వార్తలు వచ్చిన విషయం విదితమే.. అయితే ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెపై అత్యాచారం చేసిన వారు ఆటో డ్రైవర్లు కాదని తేలింది. తన ప్రియుడు, అతడి సోదరులే అత్యాచారం చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది..

వివరాల్లోకి వెళ్తే.. ఘాట్ కేసర్ లోని ఓ కళాశాలలో బీఫార్మసీ చేస్తున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆటో ఎక్కి రామ్ పల్లి చౌరస్తా వద్ద దిగింది. అక్కడి నుంచి ప్రియుడి బైక్ పై ఘాట్ కేసర్ వైపుకు వెళ్ళింది. ప్రియుడు మార్గమధ్యంలో అతడి సోదరులకు ఫోన్ చేసి, నిర్జన ప్రదేశానికి రమ్మని చెప్పాడు. దింతో వారు అక్కడికి చేరుకున్నారు. యువతి సమ్మతితోనే ఆమెతో ముగ్గురు ఏకాంతంగా గడిపారు. అయితే ఈ నేపథ్యంలోనే యువతి తల్లి అనేక సార్లు ఫోన్ చేస్తుండటంతో తనను ఎవరో కిడ్నాప్ చేశారని మాయమాటలు చెప్పింది. దింతో తల్లి కుటుంబ సభ్యులు బందువులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు సైరన్ వేసుకుంటూ ఘాట్ కేసర్ ప్రాంతంలో చక్కర్లు కొట్టారు.. ఆటోలో యువతిని కిడ్నాప్ చేశారని అనౌన్స్ మెంట్ చేస్తూ పెద్ద సౌండ్స్ తో పొలిసు వాహనాలను తిప్పారు. దింతో భయపడిన ముగ్గురు నిందితులు అక్కడినుంచి పారిపోయారు.. ఆ సమయంలో యువతిని అక్కడే ఉంచి వెళ్లిపోయారు. అయితే వారంతా గంజాయి సేవించారని పోలీసులు నిర్దారించారు. యువతి గంజాయి మత్తులో రోడ్డు పక్కన పడివుండటంతో పోలీసులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.

అయితే పోలీసులు ఆటో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అయితే తాము ఏ తప్పు చెయ్యలేదని తెలిపారు. యువతి మాత్రం ఆటో డ్రైవర్లే తనను కిడ్నాప్ చేశారని మొదట తెలిపింది. గట్టిగ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. అయితే సీసీ కెమెరాలు పరిశీలించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆటోలోంచి దిగిన విద్యార్థినిని మళ్ళీ ఆటో ఎక్కడ ఎక్కలేదని గుర్తించారు. ఓ బైక్ పై వెళ్లినట్లు కనిపించడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు.

పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆటో డ్రైవర్లు సేఫ్ అయ్యారు. ఇక విద్యార్థిని చేష్టలు చిర్రెత్తించేలా ఉన్నాయి. చాలా మంది ఆటో డ్రైవర్లను తప్పుగా అర్ధం చేసుకొని వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులు కూడా ఆటో డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని ధర్నా చేశారు. అసలు విషయం బయటపడటంతో నోరెళ్లబెట్టారు. ఇక ప్రస్తుతం విద్యార్థిని గాంధీ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ఇక ఈమెపై అత్యాచారం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఘాట్ కేసర్ అత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రేమికుడే ఇదంతా చేశాడు