కరోనా కొత్త జన్యుక్రమం.. లాక్ డౌన్ దిశగా అడుగులు

106

కరోనా వైరస్ కు మెడిసిన్ వచ్చింది అని సంబరాలు చేసుకుంటున్న సమయంలో మరో న్యూస్ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా కొత్త జన్యుక్రమం బయటపడుతుంది. దీనికి సంబందించిన సమాచారాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే సేకరించి పెట్టింది. బ్రిటన్ లో ఈ కొత్త జన్యుక్రమం బయటపడింది. కొత్తగా బయటపడిన వైరస్ వేరియంట్ ఎలాంటి అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది అనేది తెలియరాలేదు.

మొదట వచ్చిన వైరస్ ఉపిరితిత్తులపై అధిక ప్రభావం చూపింది. ఇక కొత్త జన్యువు మానవ శరీరంలోని ఏ భాగాన్ని టార్గెట్ చేస్తుందో తెలియరాలేదు. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో కొత్త కరోనా జన్యువు బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు వైద్యులు. ఇప్పటివరకు కరోనా వైరస్ చాలా రకాలుగా మార్పు చెందటాన్ని తాము గమనించామన్నారు. ఈ వైరస్ పరిణామం చెందడంతో పాటు కాలక్రమేణా మారుతూ వస్తోందన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఈ వైరస్ వేగంగా పెరుగుతుందని అంటున్నారు. వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బ్రిటన్ లో పలు ఆంక్షలువిధించారు. పబ్ లు, క్లబ్ లు, సినిమా థియేటర్లను మూసి వేశారు. ఆసుపత్రుల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

 

కరోనా కొత్త జన్యుక్రమం.. లాక్ డౌన్ దిశగా అడుగులు