వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్..

74

వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్..

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా ఏపీ డీజీపీ రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా పలు కీలక విషయాలను సిబ్బందితో పంచుకున్నారు డీజీపీ. పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన గోడప్రతిని డీజీపీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. పోలీసుల వైపు నుంచి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తామని హామీఇచ్చారు.