అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనకు ‘గతం’ సినిమా

97

51వ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనకు భారత్ నుంచి 23 సినిమాలు, 19 లఘు చిత్రాలు ఎంపిక అయ్యాయి. హిందీ, ఇంగ్లీష్ సహా పలు బాషల నుంచి సినిమాలు ఎంపిక అయ్యాయి. టాలీవుడ్ నుండి ‘గతం’ అనే సినిమా ఎంపికైంది. ఈ సినిమాకు కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించారు. ఈ విషయాన్నీ కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో సినిమాల విడుదలకు ఓటీటీలే వేదికలయ్యాయి. అలా ఈ ఏడాది నవంబర్ 7న ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది ‘గతం’. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పించింది.