మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు..

168

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నా ఆయిల్ కంపెనీలు మాత్రం వారి మాట వినే పరిస్థితిలో లేవు.. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటూ పోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శుక్రవారం రూ. 25 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర సోమవారం మరో రూ.25 పెరిగింది. దింతో వారం రోజుల వ్యవధిలో రూ.50 పెరిగింది. 2020 డిసెంబర్ నెలలో రూ. 644 గా ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు రూ. 800 దాటింది. వాణిజ్య సిలిండర్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. రూ 95 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

వంటగ్యాస్‌పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ.225 పెంచారు. డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా… ఫిబ్రవరి 4న మరోసారి రూ.644 నుంచి రూ.719కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్‌పై రూ.25 వడ్డన విధించారు. దీంతో సిలిండర్‌ ధర రూ.821.50కి చేరడం గమనార్హం.

మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు..