మళ్ళి పెరిగిన గ్యాస్ ధరలు

221

నిత్యావసరాల ధరలు కొండెక్కి కుర్చున్నాయ్.. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా వంటగ్యాస్ పై 50 రూపాయలు పెరిగింది. ఇక మరోసారి రూ.25 పెంచారు. దింతో తెలంగాణలో గ్యాస్ సిలెండర్ ధర 846.50 చేరింది. మిగతా ముఖ్య నగరాల విషయానికి వస్తే బెంగుళూరులో రూ.797, చెన్నైలో రూ.810, ముంబైలో రూ.794, కోల్కతాలో రూ.820కి చేరింది. అయితే గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఫిబ్రవరి నెలలో మూడో సారి కావడం గమనార్హం. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. గత నెలతో పోల్చితే గ్యాస్ సిలిండర్ ధర రూ.100 పెరిగింది.

మళ్ళి పెరిగిన గ్యాస్ ధరలు