ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంట శ్రీనివాస్ రావు

333

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ హుక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు పంపారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే తన రాజీనామా ఆమోదించాలని కోరారు గంటా.. ఇక కేంద్రం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది. రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు. పార్టీలకు అతీతంగా దీనిపై స్పందిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రైవేట్ కంపెనీల చేతిలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని పెట్టవద్దని పవన్ కోరారు. టీడీపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కందిస్తున్నారు. ప్రైవేటీకరణ విషయాన్నీ బీజేపీ, వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తుంది.. దీనిపై ఈ పార్టీల నుంచి ఎవరు స్పందించలేదు. మరోవైపు కమ్యూనిస్టు నేతలు ఎర్రజెండాలు చేతబట్టి కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా విశాఖలో రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ ప్లాన్ పై ప్రత్యక్షంగా 40 వేలమంది పనిచేస్తున్నారు, పరోక్షంగా మరో 10 వేలమందికి ఉపాధి ఇస్తుంది కర్మాగారం.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంట శ్రీనివాస్ రావు