రాజకీయ ఒత్తిళ్లతోనే గంగూలీకి గుండెపోటు

460

టీం ఇండియా మాజీ సారధి. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రెండు రోజుల క్రితం గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జిం చేస్తున్న సమయంలో సౌరవ్ కు గుండె నొప్పి వచ్చింది. దింతో ఆయన కోల్ కత్తాలోని వుడ్ ల్యాండ్ ఆసుపత్రిలో జాయిన్అయ్యారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. మరోమారు కూడా యాంజియోప్లాస్టీ చెయ్యాలని వైద్యులు తెలిపారు. ఇక బుధవారం దాదాను డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది.

దాదాకు గుండెపోటు రావడానికి రాజకీయ వత్తిళ్లే కారణమని సీపీఎం నేత, గంగూలీ ఫ్యామిలీ ఫ్రెండ్ అశోక్‌ భట్టాచార్య అన్నారు. మంగళవారం గంగూలీని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన అశోక్ భట్టాచార్య మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా గంగూలీకి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయాయని అన్నారు. గంగూలీ క్రేజ్ ను వాడుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే అతడిపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. ఈ ఒత్తిడి కారణంగానే గంగూలీకి గుండెపోటు వచ్చినట్లు అశోక్ ఆరోపించారు.

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు ఓట్ల కోసం దాదాను దగ్గర చేసుకునేందుకు తహతహలాడుతున్నాయని తెలిపారాయణ. త్వరలో దాదా పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చేరుతావా అని తాను అడిగితే అటువంటిది ఏమిలేదని దాదా సమాధానం ఇచ్చారని భట్టాచార్య తెలిపారు.