కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట :- మహిళ మృతి

1196

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎదో ఓ మూలన కామాంధుల చేతిలో మహిళలు బలవుతూనే ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. బదూన్‌లో నడి వయస్కురాలైన మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేశారు. శరీరాన్ని ఛిద్రం చేసి హత్య చేశారు.

పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైన విషయాలు కామాంధుల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి. మోవాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రైవేట్ భాగాల్లో ఐరన్ రాడ్డుతో దాడి చేసి పక్కటెముకలు కాలు విరగొట్టారు. ప్రైవేట్ పార్ట్శ్ లో ఐరన్ రాడ్డుతో దాడి చేశారు.

ఈ దాడిలో మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. శరీరంలో చాలా భాగాలకు గాయాలయ్యాయి. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్నుమూసింది. కాగా ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు హంత్‌ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌రాం, డ్రైవర్‌ జస్పాల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వారి ఆచూకీ కనుగొనేందుకు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. బదూన్‌ ఎస్‌ఎస్పీ సంకల్‌‍్ప శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు. త్వరలో నిందితులను పట్టుకొని శిక్షపడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు.