candida auris: కరోనాను తలదన్నే ఫంగస్.. ఎప్పుడైనా వ్యాప్తిచెందే ఛాన్స్!

95

candida auris: ఇప్పుడంటే కరోనా అంటే కొంచెం కామన్ అనిపిస్తుంది కానీ గత ఏడాది ప్రారంభంలో ఇదే మాట అంటే ప్రజల వెన్నులో వణుకుపుట్టేది. కళ్ళ ముందు మనిషి కిందపడి ప్రాణం పోతున్నా దగ్గరకి వచ్చిన నాధుడే కనిపించని సందర్భాలు సైతం వందల్లో చూశామంటే కరోనా మనల్ని ఎంత భయపెట్టిందో పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అడపాదడపా కేసులు వస్తున్నా వ్యాక్సిన్ వస్తుందన్న ధీమానో.. మనకి కరోనా నిజంగానే అలవాటు పడిందో కానీ పెద్దగా ఉలికిపాటు లేదు. అయితే.. గతం మిగిల్చిన విషాదం.. కోవిడ్ తెచ్చిన కష్టాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నాయ్.. ఇప్పటికీ కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం.

కరోనానే మనల్ని అంత భయపెట్టి.. ముప్పతిప్పలు పెడితే.. అంతకు మించి భయంకరమైన రోగం మరొకటి వస్తే.. వైరస్ ను తలదన్నే ఫంగస్ ఒకటి పుట్టుకొస్తే మన బతుకులు ఏంటి?.. ఆ మాట గుర్తిస్తేనే ఓరి నాయనో ఇదెక్కడి ఖర్మరా బాబూ అనుకోవడం కామన్. కానీ అదే నిజం. కరోనా వైరస్ ను మించిన అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఒకటి పొంచి ఉందట. అమెరికాలోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) సైంటిస్టులు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఫంగ‌స్ గురించి తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

కాండిడా ఆరిస్ అనే పేరున్న ఈ ఫంగ‌స్ ఏ వస్తువు మీదనైనా అత్యంత సుదీర్ఘ‌కాలం పాటు బ‌తికి ఉంటుందట. నిజానికి ఇది 2009లోనే గుర్తించగా ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఫంగ‌స్ ఎప్పుడైనా క‌రోనా వైర‌స్‌లా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్న సైంటిస్టులు స‌ద‌రు ఫంగ‌స్ మ‌నిషి శ‌రీరంలో ర‌క్త ప్ర‌వాహంలోకి ప్ర‌వేశిస్తే తీవ్ర ప్రాణాంత‌క ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని తెలిపారు. అయితే ఈ ఫంగ‌స్ ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్ప‌లేమ‌ని.. కరోనాలాగా వ్యాప్తి చెందితే మాత్రం మరో ఉపద్రవం తప్పదని హెచ్చరించారు. సో.. మనిషి ఎప్పుడైనా పుట్టుకొచ్చే వ్యాధులకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.