మహిళపై అత్యాచారం చేసిన మహిళ.. తలలు పట్టుకుంటున్న పోలీసులు!

250

టైటిల్ చూసి తప్పుగా రాశాం అనుకుంటున్నారా కానీ అదే నిజం. ఓ మహిళపై మరో మహిళ అత్యాచారం చేసిందట. అది కూడా నాలుగు గంటల పాటు చిత్ర హింసలకు గురిచేసి తనను రేప్ చేసిందని ఓ మహిళ కేసు పెట్టింది. ఈ విచిత్రమైన కేసుతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ కేసేంటి.. ఈ రేపేంటి అంటే వివరాలలోకి వెళ్లాల్సిందే. ఢిల్లీకి చెందిన ఓ యువతి గే, లెస్బియన్, బై సెక్సువల్ వంటి వారి సమస్యలపై పోరాడుతుంది. ఆమెకు కొంత కాలం క్రితం ఫ్రెంచ్ కు చెందిన 26 ఏళ్ల యువతి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమవగా.. ఆమె కూడా అదే తరహా సమస్యలపై పోరాటం చేస్తుంటుంది.

ఫిబ్రవరి 23న ఢిల్లీ మహిళ గోవాకు వెళ్లగా అదే సమయంలో ఆ ఫ్రెంచ్ యువతి కూడా గోవాలో ఉండడంతో తనను కలవాలని ఢిల్లీ యువతి కోరింది. దీంతో ఫ్రెంచ్ యువతి ఢిల్లీ మహిళ చెప్పిన హోటల్ కు వెళ్లి కలిసింది. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుండగా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను నొప్పి గురించి ఫ్రెంచ్ యువతి చెప్పింది. దీంతో తన వద్ద వెన్ను నొప్పికి మాత్రలు ఉన్నాయంటూ ఓ టాబ్లెట్ ను ఫ్రెంచ్ యువతికి ఢిల్లీ మహిళ ఇచ్చింది. ఆ టాబ్లెట్ వేసుకున్న ఫ్రెంచ్ మహిళ మత్తులోకి జారుకోగా ఆమెపై ఢిల్లీ మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. దాదాపు నాలుగు గంటల పాటు ఫ్రెంచ్ యువతిపై ఆమె అత్యాచారం చేసింది.

ఢిల్లీ యువతి ఏం చేస్తుందో తెలిసినా ఏం చేయలేని స్థితిలో, మత్తులో ఉండిపోయానని ఫ్రెంచ్ యువతి గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును ఎలా డీల్ చేయాలో తెలియని గోవా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తనను అత్యాచారం చేశారంటూ ఆమెపై ఫిర్యాదు చేసినప్పటికీ, దాన్ని రేప్ గా పరిగణించలేక లైంగిక వేధింపుల కేసుగా నమోదు చేయగా ఫిబ్రవరి 25న ఆ ఢిల్లీ మహిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మగాడు స్త్రీపై అత్యాచారం చేసినా.. మహిళే ఒక మగాడిని అత్యాచారం చేసినా రేప్ కేసు పెట్టొచ్చు. కానీ ఓ స్త్రీ మరో స్త్రీపైన, ఓ పురుషుడు మరో పురుషుడిపై అత్యాచారం చేస్తే రేప్ కేసుగా పరిగణించడం ప్రస్తుత చట్టాల ప్రకారం కుదరడం లేదట. అందుకే లైంగిక వేధింపుల కేసు పెట్టి విచారణ చేస్తున్నారు.

మహిళపై అత్యాచారం చేసిన మహిళ.. తలలు పట్టుకుంటున్న పోలీసులు!