బీజేపీ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. నలుగురు ఆత్మహత్య

281

బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షడు మదన్ లాల్ సైనీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరావడం లేదు. అయితే మృతుల్లో ఒకరు రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్ ఘటన స్థలిలో లభించింది. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోవడం వల్లనే తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే ఇది మృతుల్లోని వారు రాశారా లేదంటే వేరే వారు ఎవరైనా రాశారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ లో మదన్ లాల్ సైనీ పెద్ద కుమారుడు మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబం మొత్తం డిప్రెషన్ లో ఉంది. కుటుంబంలోని వారంతా మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ బాధను భరించలేకనే వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మృతులు మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు. సూసైడ్ నోట్ లో తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత బతకాలనే ఆశలేదంటూ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు.

బీజేపీ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. నలుగురు ఆత్మహత్య