దేశానికి నాలుగు రాజధానులు కావాలి :- మమతా

228

దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రొటేటింగ్ రాజధానులు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. కోల్ కత్తాని రాజధానిగా చేసుకొని ఆంగ్లేయులు పరిపాలించారని అలాంటప్పుడు దేశంలో ఢిల్లీ ఒక్కదాన్నే రాజధానిగా ఎందుకు ఉంచాలని ప్రశ్నించారు. నేతాజీ 125వ జయంతిని దేశ్ నాయక్ దివస్ గా జరుపుకుంటామని ప్రకటించారు. కోల్ కత్తాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ నేతాజీని ‘దేశ్‌నాయక్’గా రబీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారని, ఈ ‘పరాక్రమ్’ ఎక్కడదని ప్రశ్నించారు.

పరాక్రమ్ దివస్ అని ఎందుకు పేరు పెట్టారో దేశ ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాని ఆమె డిమాండ్ చేశారు. ‘అజాద్ హింద్ స్మారకం మనం నిర్మించుకుందాం. ఎలా నిర్మించాలో చేసి చూపిద్దాం. వాళ్లు విగ్రహాలు, పార్లమెంటు కాంప్లెక్స్ నిర్మాణాలకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అంటూ పరోక్షంగా కేంద్రంపై మమతా బెనర్జీ విరుచుకు పడ్డారు