టీఆర్‌ఎస్‌కు పూల రవీందర్‌ రాజీనామా

113

టీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ రాజీనామా చేశారు. మంగళవారం పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాకు పూల రవీందర్‌ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పూల రవీందర్‌ కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా తనకు టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు.

పీఆర్‌టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.. ఇకనుంచి పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చెయ్యడానికి సిద్ధమన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తామని హెచ్చరించారు.