త్వరలో ఎగిరే కార్లు.. రద్దీగా మారనున్న ఆకాశం

620

త్వరలో ఆకాశంలో ఎగిరే కార్లు మార్కెట్లోకి రానున్నాయి. దీనికి సంబందించిన అనుమతులు వచ్చేశాయి. నేలమీద నడుస్తూ అవసరానికి ఆకాశంలో ఎగిరే ఈ ప్రత్యేక కార్లు త్వరలో ఆకాశంలో విహరించనున్నాయి. 10 వేల అడుగుల ఎటులో గంటకు 100 మైళ్లకు పైగా ఎగిరే ఈ కార్లకు టేకాఫ్ క్లియరెన్స్ లభించింది. అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది. టెర్రాఫుజియా ట్రాన్సిషన్ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఎఫ్ఏఏ ప్రత్యేక లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఐతే ఎగిరే కారుకు రహదారి అనుమతి మాత్రం ఇంకా రాలేదు. విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉండడంతో ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే త్వరలో రోడ్డు అనుమతి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ కారు 27 అడుగుల వెడల్పు రెక్కలు ఉంటాయి. రోడ్డు ప్రయాణం సమయంలో ఇవి మూసుకుపోతాయి. ఆకాశంలోకి ఎగిరే సమయంలో బయటకు వస్తాయి. చిన్న రోడ్లపై ఇది ల్యాండింగ్ అవడం అసాధ్యం. ఫోర్ వే రోడ్లలో ఇది ల్యాండ్ అవడం సులువుగా ఉంటుంది. ఇక దీనిని తీసుకోవాలి అనుకునే వారు మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇందులో ఏది లేకపోయిన సంస్థ వాహనాన్ని అప్పగించదు. ఈ ఎగిరే కారు తయారీలో పాలు పంచుకున్న బృందానికి చైనా కంపెనీ టెర్రాఫుజియా అభినందనలు తెలిపింది. ఇప్పటికే ఈ ఎగిరే కారు 80 రోజుల ఫ్లైట్ టెస్టింగ్ పూర్తి చేసుకుందని సంస్థ జనరల్ మేనేజర్ కెవిన్ కోల్‌బర్న్ తెలిపారు.

త్వరలో ఎగిరే కార్లు.. రద్దీగా మారనున్న ఆకాశం