విమాన సర్వీసులను వారంపాటు నిషేధించిన సౌదీ ప్రభుత్వం

100

ఒక వైపు కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.. UK లో కరోనా టీకా ప్రవేశపెట్టినప్పటికీ, వైరస్లోని ఉత్పరివర్తనలు (కరోనావైరస్ కొత్త వేరియంట్) వెలుగులోకి వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఒక వారంపాటు నిషేధం విధించింది. అంతేకాదు సరిహద్దులను సైతం ఒక వారం పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

యూరోపియన్ దేశాల నుండి సౌదీకి వచ్చిన వారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండవలసి ఉంటుందని ప్రకటించింది. అదే సమయంలో, గత 3 నెలల్లో యూరప్ లేదా కొత్త కరోనా కేసులు ఉన్న ప్రాంతాల నుండి వచ్చిన వారు కరోనా పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని వెల్లడించింది. ఇదిలావుంటే బ్రిటన్, డెన్మార్క్, దక్షిణాఫ్రికా మరియు నెదర్లాండ్స్ నుండి వచ్చే విమానాలను టర్కీ తాత్కాలికంగా నిషేధించింది.