ELLE UK: మంటపెడుతున్న పీసీ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్..!

179

ELLE UK: క్లాస్ ఏంటి.. మాస్ ఏంటి డార్లింగ్ దా కొట్టేసుకుందామని అదేదో సినిమాలో పూరి హీరో డైలాగ్ ఒకటి చెప్తాడు. ఒన్స్ కొట్లాటకు కమిట్ అయ్యాక లెక్కలు ఎందుకు చెప్పు. అలానే యాక్టింగ్ అన్నాక.. ఆల్రెడీ ఎప్పుడో బౌండరీస్ వదిలేసాక ఇంక దేనికి భయపడాలి అన్నది పీసీ వెర్షన్. పీసీ అంటే ఎవరనుకుంటున్నారా.. మన బాలీవుడ్ బాంబ్ ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ కి వెళ్ళాక అమెరికా కోడలుగా అక్కడికి దుకాణం సర్ధేసుకున్నాక ఇక ఎలాంటి హద్దులు లేకుండాపోయింది ప్రియాంకకి. హాలీవుడ్ సినిమా అంటే ఎక్కడా దేనికి నో చెప్పనే కూడదు. ఎగ్జాట్లీ ఇదే సూత్రాన్ని ఒడిసిపట్టేసుకుంది పీసీ.

ప్రియాంక అంటే మంచి యాక్టర్ అన్నది ఇక్కడే గుర్తింపు వచ్చేసింది. ఆ విషయంలో హాలీవుడ్ లో కూడా మంచి మార్కులే పడ్డాయి. మూతి ముద్దులు.. ఇంటెన్సివ్ సన్నివేశాలకు ఇక్కడే ఒకే చెప్పిన అమ్మడు అక్కడకి వెళ్ళాక దేనికైనా రెడీ అనేసింది. ఇంకేముందు దెబ్బకి అక్కడే సెటిల్ అయిపొయింది. అసలే అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక సూపర్ గాళ్ నుండి గ్లామర్ డాల్ వరకు వచ్చే ఏ పాత్రని వదలడం లేదు. ఒకవైపు నటించడమే కాదు వెబ్ సిరీస్ లలో నిర్మాతగాను బిజీగా ఉన్న పీసీ మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో కీనూ రీవ్స్ సరసన నాలుగో సినిమాలో నటిస్తుంది.

ఇదంతా ఒకెత్తు అయితే.. పీసీ ఫోటో షూట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల విందు వడ్డించే ఈ భామ తాజాగా ఎల్లే -యూకే మ్యాగజైన్ మార్చి 2021 కవర్ పేజీ కోసం పీసీ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇవన్నీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో మంటలు పెడుతున్నాయ్. ఎల్లే కవర్ షూట్ లో పీసీ నెవ్వర్ బిఫోర్ బోల్డ్ లుక్ తో వాడి వేడిగా చర్చల్లోకొచ్చింది. అసలే భారీ అందాలు.. వాటినే హైలెట్ చేసేలా ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

మంటపెడుతున్న పీసీ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్..!