పన్ను చెల్లింపుదారులకు హెచ్చరిక.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

445

2021 – 22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రతిపాదించింది. ప్రధానంగా ఆదాయపు పన్ను విషయానికి వస్తే. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ వసూలు విధానానికి మరి కొన్ని జతచేశారు. అవేంటో ఇప్పుడు చూడం

1. టీడీఎస్ లో కీలక నిర్ణయం :

Income tax return ఫైలింగ్‌ను ప్రోత్సహించడానికి టీడీఎస్ రూల్స్‌ను కఠినతరం చేసింది కేంద్రం. సరైన సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారు, రెట్టింపు టీడీఎస్ చెల్లించుకోవలసి వస్తుంది. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

2. పీఎఫ్ విధానంలో కీలక మార్పులు

ఒక ఏడాదిలో పీఎఫ్ అకౌంట్లకు కంట్రిబ్యూట్ చేసే మొత్తం రూ.2.5 లక్షలు దాటకూడదు. ఒకవేళ దాటితే పన్ను పడుతుంది. రూ.2.5 లక్షలు దాటిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను భారం ఉంటుంది. రూ.2.5 లక్షల వరకైతే ఎటువంటి భారం ఉండదు.

3. ఎల్‌టీసీ క్యాష్ వోచర్ ప్రతిపాదన

మోదీ సర్కార్ బడ్జెట్‌లో Leave Travel Concession (LTC) క్యాష్ వోచర్‌కు సంబంధించి కీలక ప్రతిపాదన చేసింది. ఈ స్కీమ్‌పై పన్ను ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ LTC స్కీంను 2020 అక్టోబర్ లో నిర్మల సీతారామన్ ప్రకటించారు.

4. వృద్దులు ఐటీఆర్ దాఖలు

ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆర్ధిక శాఖ. 75 ఏళ్లు పైన వయసు కలిగిన వారు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని షరతులు విధించింది ప్రభుత్వం.

5. నూతన ఐటీఆర్ విధానం

అంతేకాకుండా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రిఫిల్డ్ ఐటీఆర్‌లు తీసుకువస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో ఐటీఆర్ దాఖలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

పన్ను చెల్లింపుదారులకు హెచ్చరిక.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్