ట్రాన్స్ జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్

553

ట్రాన్స్ జెండర్స్ పై జరుగుతున్న దాడులను, బెరింపులను అరికట్టేందుకు వారికీ ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ డెస్క్ ను శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. రోజు రోజుకు ట్రాన్స్ జెండర్స్ పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఈ డెస్క్ ప్రారంభించారు. సమాజంలో అందరికి వారి వారి హక్కులు ఉంటాయి వాటిని కాలరాసేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం శిక్ష అర్హులు అవుతారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.

కాగా ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్‌ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతాకృష్ణన్‌ మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉపాధి, అద్దెకు ఇళ్ళు, సన్నిహిత భాగస్వామి హింస, వీధిలో వేధింపులు వంటివి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ డెస్క్‌ ద్వారా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రాన్స్‌జెండర్లు, వారి సంఘం ప్రజల్ని వేధించడం గానీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గానీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్ల ద్వారా ఎలాంటి సమస్యలున్నా ప్రజలు డయల్‌ 100కు, వాట్సప్‌ నంబర్‌ 9490617444 ద్వారా తెలుపవచ్చన్నారు. ఇదిలా ఉంటే ట్రాన్స్ జెండర్స్ పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. కొత్త ఇల్లు, కార్యాలయం ఏర్పాటు చేస్తే వచ్చి వాలిపోతారని డబ్బులు ఇచ్చే వరకు వదలరని, అసభ్యంగా ప్రవర్తిస్తారని అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్రాన్స్ జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్