ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

132

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్ లో వున్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా అన్నిచోట్లా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయితే.. మధ్యాహ్నం 2:30 వరకు 75.55 శాతం పోలింగ్‌ నమోదు అయింది.