దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. కాంగ్రెస్ రహిత దక్షిణ భారత్

346

ఫిబ్రవరి 22 తేదీ దేశ చరిత్రలో నిలిచిపోనుంది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లేకుండా పోయాయి. దక్షిణ భారతంలో ఇన్ని రోజులు పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బలపరీక్షలో సీఎం నారాయణస్వామి విఫలం కావడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దింతో దక్షిణ భారతంలో కాంగ్రెస్ ఖాళీ అయింది. గతేడాది కర్ణాటక, ఇక ఈ రోజు పుదుచ్చేరి అధికారాన్ని చేజార్చుకుంది.

33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో 30 మంది ఎలెక్టెడ్ కాగా 3 నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 18 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కూటమిలోని 6 గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దింతో సభ్యుల బలం తగ్గింది. ప్రభుత్వాన్ని నిలుపుకోవాలి అంటే 14 మంది సభ్యుల బలం కావలసి ఉంది. కానీ కాంగ్రెస్ కూటమికి 12 మంది మాత్రమే ఉన్నారు. దింతో ఈ రోజు విశ్వాస పరీక్షా నిర్వహించారు. ఈ పరీక్షలో సీఎం నారాయణస్వామి ఓటమి చవిచూశారు.

ఆయనకు 12 ఓట్లు వచ్చాయి. దింతో తన రాజీనామా లేఖను లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై కి అందించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. కాంగ్రెస్ రహిత దక్షిణ భారత్