Vishakha steel plant : అగ్నిప్రమాదం

183

విశాఖలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌లో మంటలు ఎగసిపడ్డాయి. 2 కన్వేయర్ బెల్టులు మంటల్లో కాలిపోయాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది ఘటన స్థలికి వచ్చి మంటలు ఆర్పారు. మంటలు వచ్చిన ప్రాంతాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదంలో రూ. 25 లక్షల మేర నష్టం జరిగినట్లు తెలుస్తుంది. కాంట్రాక్ట్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్లాంట్‌ అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేదని.. మరో 8 గంటల్లో యధావిధిగా పనులు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఉద్యోగులను కలవరపాటుకు గురిచేస్తుంది.

Vishakha steel plant : అగ్నిప్రమాదం