హైదరాబాద్ : పాఠశాలలో అగ్నిప్రమాదం

146

నగరంలోని గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాఠశాలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దింతో స్థానికులు పిల్లలను రక్షించి మంటలను అదుపు చేశారు. మొత్తం పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండగా వీరందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విద్యార్థులను ఇళ్లకు పంపారు.

హైదరాబాద్ : పాఠశాలలో అగ్నిప్రమాదం