నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

77

తెలంగాణలోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రమైన నాగార్జున సాగర్ పవర్ ప్రొడ్యూసింగ్ సెంటర్ లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దింతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వెంటనే అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా మంటలు రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు ఎందుకు వచ్చాయి, సమస్య ఎక్కడ ఉంది అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం స్వల్పంగా జరిగినట్లు తెలుస్తుంది. ఎవరికి గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా గతేడాది శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.. ఇక సాగర్ లో ప్రాణనష్టం ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు