కోల్ కత్తాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు ఫైర్ సిబ్బంది మృతి.

404

కోల్ కత్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్నిప్రమాదం సమయంలో లిఫ్ట్ లో ప్రయాణిస్తూ ఐదుగురు మృతి చెందడం బాధాకరం. సోమవారం సాయంత్రం 6:30 సమయంలో కలకత్తా న్యూ కోయిలా ఘాట్ భవనం 13వ అంతస్థులో మంటలు చెలరేగాయి. దింతో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పడం ప్రారంభించారు. ఈ తరుణంలోనే అగ్నిమాపక సిబ్బంది లిఫ్ట్ లో వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. మధ్యలోకి వెళ్ళగానే పవర్ కట్ అయింది.

దింతో ఐదుగురు సిబ్బంది లిఫ్ట్ లో చుక్కుకున్నారు. దట్టమైన పొగ అంటుకోవడంతో ఊపిరి అందక లిఫ్ట్ లోనే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఫైర్ సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఒక ఆర్.పి.ఎఫ్ సిబ్బంది. ప్రజలను రక్షించే తరుణంలో సిబ్బంది మృతి చెందడం బాధాకరమైన విషయం. మొత్తం 25 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో irctc సర్వర్ మొత్తం కాలిపోయింది. దింతో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కోల్ కత్తాలో అగ్నిప్రమాదం.. ఐదుగురు ఫైర్ సిబ్బంది మృతి.