కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ లో అగ్నిప్రమాదం

149

తూర్పు గోదావరి జిల్లా కాకినాడా ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన బొడ్డు నూకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. కాకినాడలోని ఏటిమొగకు చెందిన పంతాటి కామేశ్వరరావు తన బోటు సుమారు 4 వేల లీటర్ల డీజిల్‌ నింపుకొని చేపల వేటకు సిద్ధమవుతుండగా ఆయిల్‌ ట్యాంక్‌ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో బోటు మొత్తం పూర్తి దగ్ధమైంది. ఈ ఘటనపై కాకినాడ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇక దేశంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం సీరం ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ లో అగ్నిప్రమాదం