Femina Miss India 2020: టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి మానస వారణాసి!

186

Femina Miss India 2020: తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి మానస వారణాసి అరుదైన ఘనత సాధించింది. మానస ఫెమినా మిస్​ ఇండియా వరల్డ్​ 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. జ్యూరీ సభ్యులుగా బాలివుడు నటులు వ్యవహరించి మానసను విజేతగా ఎంపిక చేశారు. తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచింది.

 మానస వారణాసి (Image:instagram/manasa5varanasi/)

హరియాణా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు.

 మానస వారణాసి (Image:instagram/manasa5varanasi/)

ఈ పోటీలకు మొదటి రౌండ్‏కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. వీఎల్‏సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ సహకరించారు. ఈ పోటీల గ్రాండ్ ఫైనల్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.

 మానస వారణాసి (Image:instagram/manasa5varanasi/)

హైదరాబాదులో నివాసం ఉంటున్న మానస వారణాసి ఇంజినీరింగ్ పూర్తి చేయగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్‌ అనలిస్టుగా ప్రస్తుతం పనిచేస్తోంది. డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొంటుంది.

 మానస వారణాసి (Image:instagram/manasa5varanasi/)

ఇక మిస్ ఇండియా వరల్డ్‌ 2020గా నిలిచిన మానసకు 2019 మిస్ ఇండియా వరల్డ్‌ సుమన్ రతన్ సింగ్ రావు కిరీటం బహుకరించారు.

 మానస వారణాసి (Image:instagram/manasa5varanasi/)

Femina Miss India 2020: టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి మానస వారణాసి!