FCUK బారసాల వేడుక చేయనున్న యూనిట్!

293

FCUK: సినిమా ఏదైనా ముందు ప్రేక్షకులకు చేరాలి. అది హిట్టా.. ఫట్టా అనేది తేల్చాల్సింది ఆ ప్రేక్షకులే కనుక ఏమైనా చేసి వారి ముంగిటకు తీసుకెళ్లాలని సినీ మేకర్స్ తెగ తాపత్రయపడుతుంటారు. ఈ ప్రాసెస్ లో ప్రధానమైనది ముందు ప్రచారం. ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే ప్రేక్షకులకు అంత చేరువవుతుందనే పద్ధతి ఎప్పుడో పోయింది. ప్రేక్షకులు అలాంటి ఊకదంపుడు ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సినీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. అలా డిఫరెంట్ గా ప్రచారం చేసే క్రమంలో ఓ సినిమా రేపు వచ్చే శనివారం బారసాల కార్యక్రమం చేపడుతుంది.

హీరో నుండి నటుడిగా మారిన జగపతిబాబు తనకు తగ్గట్లు ఛాన్స్ దక్కితే ఇప్పుడు కూడా లీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. అలానే ప్రస్తుతం fcuk అనే సినిమా సిద్ధమైంది. రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని దర్శక నిర్మాతలు మొదట నుండి చెప్తున్నారు. మరి ప్రచారం కూడా అందుకు తగ్గట్లే డిఫరెంట్ గా ఉండాలి కదా. అందుకే ఈ శనివారం మా సినిమా బారసాల కార్యక్రమం ఉంది అందరూ రండి అంటూ మీడియాకి ప్రెస్ నోట్స్ పంపించారు.

ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌ అనే సినిమా టైటిల్ అర్థంతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. అందుకే శనివారం బారసాల కార్యక్రమం అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ ఆకర్షించారు. సహజంగా ప్రస్తుతం ట్రెండ్ లో సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. fcuk టీం కూడా ఆ ఈవెంటునే బారసాలగా మర్చి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌లను పరిచయం చేస్తూ ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేసిన టీజ‌ర్ ఆసక్తి రేకెత్తించగా ఇప్పడు ఇలా పబ్లిసిటీ మరికాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి శనివారం ట్రైలర్ విడుదలలో ఇంకెంత డిఫరెంట్ చూపిస్తారో చూడాలి మరి!

FCUK బారసాల వేడుక చేయనున్న యూనిట్!