కరోనా కారణంగా భార్యకు ముద్దు కూడా ఇవ్వలేదు – ఫరూక్ అబ్దుల్లా

159

కరోనా మహమ్మారి కారణంగా చాలామంది తమ సొంతవారితో కూడా ఆప్యాయంగా గడపలేక పోయారు. ఇక వృద్ధుల పరిస్థితి చెప్పనక్కరలేదు. కరోనా వస్తే చనిపోతామనే భయం వారిలో అధికంగా కనిపించేది. తమ చిన్నతనంలో వచ్చిన రోగాలను ఇప్పుడున్న యువతకు గుర్తు చేస్తూ.. దానికంటే ప్రమాదకరమైనది కరోనా అంటూ తెలియచేశారు. ఇక కరోనా గురించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు.. ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఛలోక్తులు విసిరారు. నవ్వులు పూయించారు.

కరోనా సమయంలో తన భర్యకు ముద్దుకూడా ఇవ్వలేదని ఈ 83 ఏళ్ల వృద్ధ లీడర్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. కరోనా మనకు చాలా నేర్పిందని, మనుషులను దూరంగా పెట్టిందని అన్నారు. వృద్ధాప్యంలో ఉండటంతో తాము చాలా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ఒకవేళ కరోనా వస్తే కోలుకోవడం కష్టమనే ఆలోచన తమకు జాగ్రత్తగా ఉండేలా చేసినట్లు వివరించారు. దీని భయంతో తన భార్యతో కౌగిలింత ప్రసక్తే లేకుండా పోయిందని అన్నారు.

మనసెంత కోరుకున్నా సరే” నిగ్రహంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఫరూక్ అబ్దుల్లా. కొవిడ్‌-19 టీకాలు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన అబ్దుల్లా.. త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవ్వాలని అందరూ దేవుడిని ప్రార్థించాలని కోరారు. అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా కారణంగా భార్యకు ముద్దు కూడా ఇవ్వలేదు – ఫరూక్ అబ్దుల్లా