గాడి తప్పుతున్న రైతుల ర్యాలీ

101

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల నేతలు, రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా మంగళవారం ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొదట ట్రాక్టర్ ర్యాలీ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తుది నిర్ణయం ఢిల్లీ పోలీసులదే అని తెలిపింది. దింతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు పోలీసులు.

ఇక 12 గంటలకు ప్రారంభం కలవాల్సిన ర్యాలీని 11 గంటలకే ప్రారంభించారు. పోలీసులు అడ్డుపెట్టిన బారికేట్లను తొలగిస్తూ ర్యాలీలో పాల్గొంటున్నారు రైతులు. మొత్తం 90 వేలకు పైగా ట్రాక్టర్లును ర్యాలీకి తీసుకొచ్చారు. ఇక ఘాజీపూర్ వద్ద రైతులు బారికేడ్లను విరగగొట్టడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. సింగు, తిక్రీల సరిహద్దుల్లో బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. రైతులు ట్రాక్టర్లపై పరేడ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 వేల మంది సాయుధ పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు.

ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు పాల్గొనే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చయించాయి. దింతో హస్తినకు డేగ కళ్ళతో పహారా కాస్తున్నారు పోలీసులు. కేంద్ర బలగాలు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నాయి. గణతంత్ర దినోత్సవం వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలను పరిశీలించేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారు.

గాడి తప్పుతున్న రైతుల ర్యాలీ