Farmers protest : రైతుల ధర్నాలో డాక్టర్ కి ఏం పని?

139

Farmers protest : రైతుల ధర్నాలో డాక్టర్ కి ఏం పని?

డాక్టర్ కఫిల్ ఖాన్.. ఈ పేరు చాలామందికి సుపరిచితమే.. ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లో చిన్నపిల్లలు మృతి చెందిన సమయంలో ఘోరకపూర్ ఆసుపత్రిలో సూపరిండెంట్ గా ఉన్నాడు ఈ కఫిల్ ఖాన్. పిల్లల మృతికి ఇతడే కారణమని గతంలో ఆరోపణలు ఎదురుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు కేసు కూడా నమోదైంది. అయితే ఇతడు జనవరి 26 న జరిగిన రైతు ర్యాలీకి వెళ్లేందు ట్రాక్టర్ పై బయలుదేరగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు గంటలపాటు విచారించి తరువాత ఇంటికి పంపారు. అయితే కఫిల్ ఖాన్ రైతుల ర్యాలీకి వెళ్లేందుకు యత్నించిన విషయం ప్రజలకు తెలియడంతో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ డాక్టర్ కు రైతు ర్యాలీలో పాల్గొనే అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరపాలని యూపీ వాసులు పోలీసులను కోరుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ఉత్తర ప్రదేశ్ సరిహద్దు సింఘు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ధర్నాను నిలిపివేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని వారు రైతులను కోరారు. రైతులు అందుకు నిరాకరించడంతో స్థానిక గ్రామాల ప్రజలు రైతులపై తిరగబడ్డారు. ప్రజలకు, రైతులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Farmers protest : రైతుల ధర్నాలో డాక్టర్ కి ఏం పని?