రైతు ఉద్యమం : హర్యానా, పంజాబ్ లో హై అలర్ట్

203

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2 నెలలుగా శాంతియుతంగా చేస్తున్న రైతు ఉద్యమం మంగళవారం హింసాత్మకంగా మారింది. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా, నిరసనకారులు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, భద్రతా దళాల వాహనాలను ధ్వంసం చేశారు. మంగళవారం హింసాత్మక సంఘటనలపై పోలీసులు ఇప్పటివరకు 22 కేసులు నమోదు చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో 86 మంది పోలీసులు గాయపడ్డారు. అలాగే చాలా మంది రైతులు కూడా గాయపడ్డారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక రైతు కూడా మరణించాడు. ఇదిలావుంటే మంగళవారం జరిగిన పరిణామాలపై ఢిల్లీ పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు ఈ రోజు సింగు సరిహద్దులో రైతు సంఘాల నాయకులు సమావేశం కానున్నారు. బహుశా ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సింగు సరిహద్దు, టికి సరిహద్దు, ఎర్ర కోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ పెట్టింది.