రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం

82

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు గత 20 రోజులుగా నిరసన చేస్తున్నారు. అయితే రైతులు ఈ విధంగా నిరసన చేపట్టడం వలన రోజుకు 3500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచాం సంస్థ అంచనా వేసింది. రైతుల ఆందోళనల వలన వ్యవసాయ ఉత్పత్తుల రవాణా తగ్గింది.

దింతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. మరో వైపు కరోనా కష్టకాలం నుంచి కొద్దిగా బయటపడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్ధిక వ్యవస్థకు రైతుల సమ్మె గుదిబండలా మారింది. రైతుల నిరసనల వలన తమకు సమయానికి వ్యవసాయ ఉత్పత్తులు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యవసాయాధారిత కంపెనీల యజమానులు వాపోతున్నారు.

పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లతో ముడిపడి ఉన్న అన్ని రంగాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఫుడ్ ప్రాసెసింగ్, కాటన్ టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫామ్ మిషనరీ, ఐటీ వంటి రంగాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటున్నాయని.. రైతుల దీక్షల వల్ల.. అవన్నీ ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు పంజాబ్ నుంచే అధికంగా వస్తుంటాయి. రైతుల సమ్మెతో వీటి రవాణా నిలిచిపోయింది. ప్రధానంగా వారికోటమిషన్లకు సంబందించిన విడిభాగాలు ఇక్కడినుంచే సప్లయ్ అవుతాయి. బంద్ కారణంగా వాటి రవాణా పూర్తిగా స్తంభించింది. దింతో తెలుగు రాష్ట్రాల్లో వరికోత మిషన్ విడిభాగాల రేట్లు విపరీతంగా పెరిగాయి.

రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం