ప్రగతి భవన్ ను ముట్టడించిన రైతులు

81

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ నష్టపరిహారం రావాలి అంటే రైతులు ముందుగా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ పంట నష్టం జరిగితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి నష్టపరిహారం చెల్లిస్తాయి.

అయితే ఈ పథకానికి సంబందించిన డబ్బును తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా విడుదల చేయడం లేదు. దింతో పంట నష్టపోయిన రైతులు నష్టపరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ను రైతులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెక్యూరిటీని దాటుకొని ప్రగతిభవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. కాగా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతోప్రగతిభవన్ ఎదుట కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రైతులను స్టేషన్ కు తరలించారు.

ప్రగతి భవన్ ను ముట్టడించిన రైతులు