ఎర్రకోటపై ఎగిరిన రైతుల జెండా

143

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ మహానగరంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో వారు ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి ఫ్లాగ్ పోల్‌పై జెండాలు ఎగరేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు.

వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. సమయానికి ముందే ర్యాలీ ప్రారంభించడంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట సమయంలోనే ర్యాలీ పక్కదారి పట్టి ఏకంగా ఎర్రకోటపై చేరింది. ఎట్టకేలకు ఎర్రకోట చేరిన రైతు ఆందోళనకారులు ఎర్రకోట బురుజులపై జెండాలు ఊపుతూ హడావిడి చేశారు. తమకు నిర్దేశించిన మార్గంలో కాకుండా రైతు నిరసనకారులు వేరే మార్గంలో ఎర్రకోటకు చేరినట్టు చెబుతున్నారు.

ఎర్రకోటపై ఎగిరిన రైతుల జెండా