పోలీసులను కర్రలతో కొట్టిన రైతులు

188

శాంతియుతంగా ర్యాలీ తీస్తామని అనుమతి తీసుకున్న రైతులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలీసులను టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. పోలీసులపైకి ట్రాక్టర్లను ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇక భారికేట్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా వారు మార్గాన్నే మార్చి ఎర్రకోటవైపు దూసుకెళ్లి ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఏడాదిలో చాలామంది పోలీసులు గాయపడ్డారు.

అయితే ఇంటిలిజెన్స్ అధికారులు చెప్పినట్లే ర్యాలిలోకి సంఘవిద్రోహ శక్తులు ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. రైతులు ఈ విధంగా ప్రవర్తించరని పలు రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఈ ర్యాలీలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ రైతు మృతి చెందాడు. దింతో రైతు మృతదేహాన్ని రోడ్డుపై వేసి ధర్నా నిర్వహిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారు. ట్రాక్టర్లతో బస్సులను ధ్వంసం చేశారు రైతులు. పోలీసులు పలు మార్లు బాష్పవాయువు ప్రయోగం చేశారు.

ఇదిలా ఉంటే, ఇంతకాలం కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో ఢిల్లీలోకి సంఘవిద్రోహ శక్తులు చేరలేకపోయాయని, ఈ ర్యాలీతో ఢిల్లీలో అవి చేరి తిష్టవేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇక ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు రైతుల చేతిలో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శాంతి కాస్త అశాంతిగా మారడంతో ర్యాలీకి అర్ధం లేకుండా పోయింది. అయితే ఈ ర్యాలీ వెనక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ప్రభుత్వాన్ని నేరుగా ఎదురుకోవడం చేతకాని కొందరు నేతలు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ ఉద్యమానికి కొందరు వ్యక్తులు భారీగా ఫండింగ్ చేసినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.

పోలీసులను కర్రలతో కొట్టిన రైతులు